*అనిశా వలలో గూడూరు తహశీల్దార్*
*కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనాబీ అనిశా వలకు చిక్కుకున్నారు. రైతు నుంచి రూ.4 లక్షలు లంచం తీసుకునేందుకుప తన తరఫున మహబూబ్ బాషా అనే వ్యక్తిని తహసీల్దార్ పంపించారు*
రైతు నుంచి లంచం తీసుకుంటూ ఉండగా.. హసీనాబీ పంపిన వ్యక్తిని అనిశా అధికారులు పట్టుకున్నారు. అతడిని విచారించగా తహసీల్దార్ తనని పంపించినట్లు అనిశా అధికారులకు మహబూబ్ బాషా చెప్పాడు. అతడి నుంచి రూ.4 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మహబూబా బాషాను అరెస్టు చేసిన సమాచారాన్ని తెలుసుకున్న హసీనాబీ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.