నిజామాబాద్ :
మహిళల ఆత్మగౌరవం పెంపొందించే బతుకమ్మ పండుగను దృష్టిలో పెట్టుకొని పండుగను ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చీరలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ ఎం ఆర్ ఎం రావు అన్నారు సోమవారం సాయంత్రం మినీ అంబేద్కర్ భవన్లో అర్బన్ నియోజవర్గ చీరల పంపిణి జిల్లా కలెక్టర్ తో కలిసి అర్బన్ ఎమ్మెల్యే శ్రీ బీగాల గణేష్ గుప్త చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేద నిరుపేద 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు జిల్లాలో అన్ని సర్వం సిద్ధం చేసినట్లు చెప్పారు బతుకమ్మ చీరల ఆడపడుచులకు ప్రయోజనం తో పాటుగా చేనేత కార్మికులకు జీవనాధారం పెంపొందించేందుకు ప్రభుత్వము చర్యలు తీసుకుందని చెప్పారు ఒక్కొక్క బతుకమ్మ పండుగకు విభిన్న రంగులలో మహిళలకు పంపిణీ చేయడం జరిగిందని అయితే ఈసారి పది రంగుల తో వంద రకాలుగా గతంలో కంటే మిన్నగా ఆకర్షణీయమైన రంగుల్లో పంపిణీ చేస్తామని గత సంవత్సరం 4 లక్షల 83 వేల చీరలు పంపిణీ చేశామని ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి సుమారు 5 లక్షల 84 వేల చీరలను జిల్లాకు వచ్చాయని వాటిని మల్లారం బోధన్ వ్యవసాయ గిడ్డంగులు భద్రపరచడం చెప్పారు దసరా పండుగకు ఆడపడుచులకు గిఫ్టుగా అందిస్తున్నారని చెప్పారు ప్రభుత్వం ప్రతి వర్గానికి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ప్రజలు అడగకుండానే అమలు చేశారని అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా ముందుకు సాగుతున్నాయని సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడలేని విధంగా అమలు జరుగుతున్నాయి ప్రతి నెల 54 కోట్ల రూపాయల విలువగల ఆసరా పింఛన్ల సంక్షేమ కార్యక్రమాలు పంపిణీ చేస్తున్నట్లు సంక్షేమ అభివృద్ధి రెండు సమాన ప్రాధాన్యత తో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా నిలుస్తుంది ప్రకృతిని ఆదరించే దగ్గరగా ఉండే బతు కమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు జిల్లాలో విపరీతమైన భారీ వర్షాలు కురిసి దృష్ట్యా చెరువులు అలుగు, కాలువలలో నిండుగా ప్రవహిస్తూ ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు
అర్బన్ శాసనసభ్యులు శ్రీ బీగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవం బతుకమ్మ పండుగని దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మను ఆదరణ ప్రాచుర్యం పొందిందని దానికి ముఖ్య కారకులు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీమతి కవిత గారు అని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలకు సంక్షేమం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు గౌరవంగా ఉండేందుకు బతుకమ్మ చీరలను విభిన్న రంగులలో వచ్చాయని చెప్పారు మహిళలకు అన్నగా మామగా కుటుంబ పెద్దగా వ్యవహరిస్తూ అట్టడుగు అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి సైనికుని గా పనిచేస్తున్నారని చెప్పారు వృద్ధులకు ఒంటరి మహిళలకు వితంతువు జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రతి నెల 2 వేల 16 రూపాయల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందని గర్భిణీ స్త్రీలకు బాలింతలకు శిశువులకు మెరుగైన పౌష్టికాహారం అందించడం 12 వేలు డెలివరీ కాగానే కెసిఆర్ కిట్టు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు బతుకమ్మ చీరలు పంపిణీ నగరంలో 92 వేల మందికి 96 లోకేషన్ లో రేషన్ షాపుల ద్వారా పంపిణి చేయనున్నట్లు ఈ సందర్భంగా 7, 8, 9 రేషన్ షాపుల పరిధిలోగల మహిళలకు పంపిణీ చేస్తున్నట్లు నగరంలో అన్ని ప్రదేశాల లో రేపటి నుండి
పంపిణీ జరుగుతుంది 18 సంవత్సరాలు నిండి ఫుడ్ సెక్యూరిటీ కార్డు గల వారందరికీ బతుకమ్మ చీరలు కులాలకు అతీతంగా పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు
ఈ పంపిణీ కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తాజా మాజీ మేయర్ ఆకుల సుజాత నగర పాలక కమిషనర్ జాన్సంసన్ పిడి మెప్మా రాములు తదితరులు పాల్గొన్నారు.
Monday, September 23, 2019
ఉచిత బతుకమ్మ చీరల పంపిణీ......
-
'జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బిహారీ వలసదారులు, కాశ్మీరీ పండిట్లు, సిక్కులను లక్ష్యంగా చేసుకుంటున్నారు 'అని రౌత్ ...
-
పేదోళ్ల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మంజూరులో లంచం డిమాండ్ చేసే అధికారుల దవడ పగలకొట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. అలా చేస్తేనే కొంతమంది...
-
ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో తెలంగాణ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్ని...