ఆర్టీసీ రూట్ల ప్రైవైటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూట్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇది ఓ రకంగా ఆర్టీసీ జేఏసీకి షాకేనని చెప్పవచ్చు. 5100 రూట్లను ప్రైవేటుకు అప్పగిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో రూట్ల ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున వాదనలు గట్టిగా వినిపించారు. ప్రభుత్వానికి సానుకూలంగా హైకోర్టు తీర్పు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రూట్ల ప్రైవేటీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారానేది ఉత్కంఠగా మారేది. దాదాపు గత 50 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత గురువారం సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పారు. అయితే, మళ్లీ శుక్రవారం సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని చెప్పడం గమానర్హం. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.ఆర్టీసీ ప్రైవేటీకరణపై సుదీర్ఘ వాదోపవాదలు జరిగాయని న్యాయవాది ఒకరు తెలిపారు. మోటార్ వెహికిల్ యాక్ట్ 1988 సెక్షన్ 102 ప్రకారం ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉందని.. మంత్రివర్గానికి విస్తృత అవకాశాలున్నాయి.. కోర్టులు జోక్యం చేసుకోజాలవని పేర్కొంది. ఈ మేరకు అడ్వోకేట్ జనరల్ చేసిన వాదనలతో హైకోర్టు ఏకీభవించిందన్నారు. పబ్లిక్ లిటిగేషన్స్ కొట్టివేయడం జరిగిందన్నారు. ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా జోక్యం చేసుకోలేమని చెప్పిందని తెలిపారు.
-
'జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బిహారీ వలసదారులు, కాశ్మీరీ పండిట్లు, సిక్కులను లక్ష్యంగా చేసుకుంటున్నారు 'అని రౌత్ ...
-
పేదోళ్ల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మంజూరులో లంచం డిమాండ్ చేసే అధికారుల దవడ పగలకొట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. అలా చేస్తేనే కొంతమంది...
-
ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో తెలంగాణ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్ని...