Friday, November 22, 2019

ఇలియానా ఆత్మహత్యాయత్నం...!


ప్రతీ వ్యక్తి జీవితంలో కష్ట సుఖాలు అనేవి ఏదో సమయంలో పలకరిస్తూనే ఉంటాయి. కాకపోతే కొందరికి ఎక్కువ మరికొందరికి తక్కువ అంతే తేడా. ఇక ఈ కష్టసుఖాలను సెలెబ్రిటీలు కూడా ఏ మాత్రం అతీతులు కాదు. బయటకు అలా కనిపించినా వారి వారి వ్యక్తిగత జీవితాల్లోనూ ఎన్నో కష్టసుఖాలు నిండి ఉంటాయి. ఈ కోవలోనే గోవా బ్యూటీ ఇలియానా జీవితంలో కష్టాలు పడిందట. అవి తట్టుకోలేక చివరకు ఆత్మహత్యాయత్నం కూడా చేసిందట. తాజాగా ఆ విషయాలు బయటపెట్టింది ఇలియానా. వివరాల్లోకి పోతే.. దేవదాస్ సినిమాతో టాలీవుడ్ తెరకు కొత్త అందాల రుచి చూపించి వావ్! అనిపించింది గోవా బ్యూటీ ఇలియానా. ఆ తర్వాత వరుస ఆఫర్స్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈమె.. వెంటనే రూటు మార్చేసి బాలీవుడ్ వైపు మొగ్గుచూపింది. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించే అవకాశం రావడంతో అక్కడే సెటిలై తెలుగు సినిమాలకు కొంతకాలం దూరంగా ఉంది. నాజూకు నడుముతో ఇలియానా చేసిన డాన్సులు, అందాల ప్రదర్శనకు ఫిదా అయింది టాలీవుడ్ లోకం. అయితే కొన్నేళ్ల పాటు తెలుగు తెరకు దూరమైన ఈమె తిరిగి 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో దర్శనమిచ్చింది. కాకపోతే మునుపటిలా కాకుండా బొద్దుగా తయారై టాలీవుడ్ ప్రేక్షకులకు షాకిచ్చింది. కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్‌గా రికార్డు నెలకొల్పిన ఈ అమ్మడు తన జీవితంలో చాలా కష్టాలున్నాయని, ఒకానొక దశలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆత్మహత్యకు కూడా యత్నించానని చెప్పి ఆశ్చర్యపరిచింది ఇలియానా. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు స్వయంగా చెప్పింది ఇల్లీ బేబీ. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రఫర్ ఆండ్య్రూతో పీకల్లోతు ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న ఇలియానా.. ఆ తర్వాత ఊహించని రీతిలో అతనితో బ్రేకప్ చేసుకుంది. ఈ విషయాన్ని ఇలియానా తట్టుకోలేక పోయిందట. తనకు ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చేవని కూడా ఇలియానా చెప్పుకొచ్చింది. ఓ వైపు సినిమాలు లేక, మరోవైపు వ్యక్తిగత జీవితం గాడి తప్పడంతో చచ్చిపోవడమే మేలని ఆమె భావించిందట.  జీవితంలో ఎదురైన కొన్ని పరిస్థితులు తట్టుకోలేక ఓ రోజు ఏకంగా 12 పవర్ ఫుల్ నిద్రమాత్రలు కూడా మింగానని చెబుతోంది ఇలియానా. ఆ పరిస్థితుల్లో నిద్ర కూడా పట్టేది కాదని, నిద్రలేమి వల్లే తాను చాలా బరువు పెరిగిపోయానని ఇలియానా తెలిపింది. ఆ తర్వాత ఆ బరువు తగ్గించుకోవడానికి జిమ్‌కు వెళ్లేదాన్నని, ఆ సమయంలో మీడియా చాలా ఫొటోలు తీసిందని, ఆ ఫొటోలు బయటికి రావడంతో తనను సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేయడం కూడా బాధ పెట్టిందని తెలిపింది ఇలియానా.