దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు మాగ్నటిక్ స్టిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ కార్డులతో మార్చుకోవాలని సూచిస్తోంది. కస్టమర్ల వద్ద ఉన్న పాత కార్డులు డిసెంబర్ 31 తరువాత పనిచేయవని తెలిపింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం కార్డులను రీప్లేస్ చేసినట్టు వివరించింది. మాగ్నటిక్ స్టిప్ కార్డులతో మోసాలు జరుగుతుండడంతో వాటిని అరికట్టే ప్రయత్నంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2016లో అప్పటికి వినియోగంలో ఉన్న మాగ్నటిక్ స్టిప్ డెబిట్ కార్డుల స్థానంలో ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులను ఆర్బీఐ ప్రవేశ పెట్టింది . ఇప్పటికీ కూడా కొత్త ఈఎంవీ చిప్ కార్డు పొందని కస్టమర్లకు వెంటనే బ్యాంక్‌కు వెళ్లి కార్డును మార్చుకోవాలని కస్టమర్లకు సూచించింది.
మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డును మార్చుకోవడానికి
కస్టమర్లు ఆయా బ్రాంచ్‌లకు వెళ్లి దరఖాస్తు
చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఎస్‌బీఐ
తన అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ కూడా
చేసింది. కొత్త ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత ఎస్‌బీఐ
డెబిట్ కార్డు తీసుకోవాలని తెలిపింది. ఈ కార్డుల
వల్ల ఎన్నో మోసాలు జరుగుతున్నాయని, వాటిని
దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు
తెలిపింది. మాగ్నటిక్ స్టిప్ కార్డులు
మార్చుకోవాలని ఇప్పటికే ఎన్నో సార్లు
సూచించడం జరిగిందని, కార్డులను మార్చుకోని
వారికి ఇక ఈనెల 31 వరకు మాత్రమేనని పేర్కొంది.
సూచించింది.