ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వినియోగం తగ్గి, ఉత్పత్తులు పడిపోయి, వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల వినిమయ శక్తిని పెంచేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. వివిధ రంగాలకు ఉద్దీపనలు ప్రకటించింది. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. వినిమయ శక్తిని పెంచేందుకు, ఆర్థిక మందగమనం లేకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వివిధ అంశాలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితం చెప్పారు. అయితే ఇప్పుడు వినియోగాన్ని పెంచేందుకు తక్కువ ఆదా, మరింత ఖర్చు మంత్రాన్ని తెచ్చేలా కనిపిస్తోంది.
ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. సంఘటిత రంగంలోని లక్షలాదిమంది ఉద్యోగుల శాలరీ-పీఎఫ్‌లో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ తగ్గించుకొని, టేక్ హోమ్ శాలరీ ఎక్కువగా ఉండేలా ఆప్షన్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఇది బేసిక్ శాలరీలో 12 శాతంగా ఉంది. దీనిని ఇప్పుడు తగ్గించుకొని, టేక్ హోమ్ శాలరీ ఎక్కువగా తీసుకునే వెసులుబాటు ఉద్యోగులకు కల్పించనుంది.
ఈ మేరకు సోషల్ సెక్యూరిటీ కోడ్ బిల్ 2019లో ఒక ప్రొవిజన్‌గా ఉది ఉంటుందని కేంద్ర కార్మిక సాఖ తెలిపింది. దీనికి కేబినెట్ ఆమోదం లభించింది. ఈ వారంలో దీనిని పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నట్లు లేబర్ మినిస్ట్రీ అధికారులు చెబుతున్నారు. ఉద్యోగులకు తక్కువ పీఎఫ్, ఎక్కువ టేక్ హోమ్ శాలరీ ఆప్షన్ ఉంటే వ్యవస్థలో వినిమయ శక్తి పెరుగుతుందని కేంద్రం భావిస్తోందట. ఇటీవలి కాలంలో వినియోగం తగ్గి, డిమాండ్ లేక, వృద్ధి రేటు ఏడెనిమిదేళ్ల కనిష్టానికి చేరుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం పీఎఫ్ అంశంలో కొత్త ఆలోచన చేస్తోందని తెలుస్తోంది.
కేంద్రం పీఎఫ్‌ను 12 శాతంగానే ఉంచిందని, పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌పై బిల్లును పార్లమెంటులో చర్చించి, పాస్ అయ్యాక నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. పీఎఫ్ 12 శాతంగానే ఉన్నప్పటికీ, ఉద్యోగులకు ఆప్షన్ మాత్రమే ఉంటుంది. అంటే అది వారి ఇష్టం.
Monday, December 9, 2019
మోడీ ప్రభుత్వం PF కొత్త ప్లాన్
-
'జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బిహారీ వలసదారులు, కాశ్మీరీ పండిట్లు, సిక్కులను లక్ష్యంగా చేసుకుంటున్నారు 'అని రౌత్ ...
-
పేదోళ్ల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మంజూరులో లంచం డిమాండ్ చేసే అధికారుల దవడ పగలకొట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. అలా చేస్తేనే కొంతమంది...
-
ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో తెలంగాణ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్ని...