Monday, December 23, 2019

పురపాలక ఎన్నికల ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల


పురపాలక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. వార్డుల వారీ ఓటర్ల జాబితా షెడ్యూల్ ప్రకటించింది. 120 మున్సిపాల్టీలు, పది కార్పోరేషన్లలో ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 30న వార్డుల వారీ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేయనుంది. ముసాయిదాపై వచ్చేనెల రెండో తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ఈనెల 31న జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. మున్సిపాల్టీలు, కార్పోరేషన్ల స్థాయిలో వచ్చేనెల 1న పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. వచ్చే నెల నాలుగో తేదీన వార్డుల వారీ తుది జాబితా ప్రకటిస్తారు.