*BREAKING...* మహారాష్ట్ర లోని నాందేడ్ పరిసర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా డ్యామ్ లలో వృధా నీటిని గోదావరి నది ద్వారా వదులుతున్నాము ... గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరుగుతున్న దృశ్య ... గోదావరి పరిసర గ్రామాలు,ఆయకట్టు రైతులు,శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారు అప్రమతంగా ఉండాలని హెచ్చరికలు జారీ ...నాందేడ్ జిల్లా కలెక్టర్
Thursday, September 26, 2019
గోదావరి పరిసర ప్రాంతాలవారికి హెచ్చరిక.....
Monday, September 23, 2019
ఉచిత బతుకమ్మ చీరల పంపిణీ......
నిజామాబాద్ :
మహిళల ఆత్మగౌరవం పెంపొందించే బతుకమ్మ పండుగను దృష్టిలో పెట్టుకొని పండుగను ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చీరలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ ఎం ఆర్ ఎం రావు అన్నారు సోమవారం సాయంత్రం మినీ అంబేద్కర్ భవన్లో అర్బన్ నియోజవర్గ చీరల పంపిణి జిల్లా కలెక్టర్ తో కలిసి అర్బన్ ఎమ్మెల్యే శ్రీ బీగాల గణేష్ గుప్త చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేద నిరుపేద 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు జిల్లాలో అన్ని సర్వం సిద్ధం చేసినట్లు చెప్పారు బతుకమ్మ చీరల ఆడపడుచులకు ప్రయోజనం తో పాటుగా చేనేత కార్మికులకు జీవనాధారం పెంపొందించేందుకు ప్రభుత్వము చర్యలు తీసుకుందని చెప్పారు ఒక్కొక్క బతుకమ్మ పండుగకు విభిన్న రంగులలో మహిళలకు పంపిణీ చేయడం జరిగిందని అయితే ఈసారి పది రంగుల తో వంద రకాలుగా గతంలో కంటే మిన్నగా ఆకర్షణీయమైన రంగుల్లో పంపిణీ చేస్తామని గత సంవత్సరం 4 లక్షల 83 వేల చీరలు పంపిణీ చేశామని ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి సుమారు 5 లక్షల 84 వేల చీరలను జిల్లాకు వచ్చాయని వాటిని మల్లారం బోధన్ వ్యవసాయ గిడ్డంగులు భద్రపరచడం చెప్పారు దసరా పండుగకు ఆడపడుచులకు గిఫ్టుగా అందిస్తున్నారని చెప్పారు ప్రభుత్వం ప్రతి వర్గానికి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ప్రజలు అడగకుండానే అమలు చేశారని అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా ముందుకు సాగుతున్నాయని సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడలేని విధంగా అమలు జరుగుతున్నాయి ప్రతి నెల 54 కోట్ల రూపాయల విలువగల ఆసరా పింఛన్ల సంక్షేమ కార్యక్రమాలు పంపిణీ చేస్తున్నట్లు సంక్షేమ అభివృద్ధి రెండు సమాన ప్రాధాన్యత తో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా నిలుస్తుంది ప్రకృతిని ఆదరించే దగ్గరగా ఉండే బతు కమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు జిల్లాలో విపరీతమైన భారీ వర్షాలు కురిసి దృష్ట్యా చెరువులు అలుగు, కాలువలలో నిండుగా ప్రవహిస్తూ ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు
అర్బన్ శాసనసభ్యులు శ్రీ బీగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవం బతుకమ్మ పండుగని దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మను ఆదరణ ప్రాచుర్యం పొందిందని దానికి ముఖ్య కారకులు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీమతి కవిత గారు అని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలకు సంక్షేమం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు గౌరవంగా ఉండేందుకు బతుకమ్మ చీరలను విభిన్న రంగులలో వచ్చాయని చెప్పారు మహిళలకు అన్నగా మామగా కుటుంబ పెద్దగా వ్యవహరిస్తూ అట్టడుగు అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి సైనికుని గా పనిచేస్తున్నారని చెప్పారు వృద్ధులకు ఒంటరి మహిళలకు వితంతువు జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రతి నెల 2 వేల 16 రూపాయల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందని గర్భిణీ స్త్రీలకు బాలింతలకు శిశువులకు మెరుగైన పౌష్టికాహారం అందించడం 12 వేలు డెలివరీ కాగానే కెసిఆర్ కిట్టు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు బతుకమ్మ చీరలు పంపిణీ నగరంలో 92 వేల మందికి 96 లోకేషన్ లో రేషన్ షాపుల ద్వారా పంపిణి చేయనున్నట్లు ఈ సందర్భంగా 7, 8, 9 రేషన్ షాపుల పరిధిలోగల మహిళలకు పంపిణీ చేస్తున్నట్లు నగరంలో అన్ని ప్రదేశాల లో రేపటి నుండి
పంపిణీ జరుగుతుంది 18 సంవత్సరాలు నిండి ఫుడ్ సెక్యూరిటీ కార్డు గల వారందరికీ బతుకమ్మ చీరలు కులాలకు అతీతంగా పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు
ఈ పంపిణీ కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తాజా మాజీ మేయర్ ఆకుల సుజాత నగర పాలక కమిషనర్ జాన్సంసన్ పిడి మెప్మా రాములు తదితరులు పాల్గొన్నారు.
Friday, September 20, 2019
SBI లో అప్రెంటీస్ ఉద్యోగాలు...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 700 పోస్తులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హత: అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసుండాలి.
ఎంపిక విధానం: అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వయసు : అభ్యర్ధులు 20 నుంచి 28 ఏళ్ల వయసు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు మాత్రం రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 17, 2019.
దరఖాస్తు చివరితేది: అక్టోబర్ 6, 2019.
ఆన్ లైన్ పరీక్ష: అక్టోబర్ 23, 2019.
కాల్ లెటర్ : అక్టోబర్ 15, 2019.
ఫోన్ ఉఠావో,ఇండియా పడావో....
మనదేశానికి చెందిన గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లీష్ మాట్లాడటం సరిగ్గా రాదనే ఓ అపవాదు ఉంది. గ్రామాల్లో నివసించే విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై పట్టు ఉండదని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు గానీ, ప్రావీణ్యంగానీ ఉండదని అంటుంటారు. ఈ అపవాదును తొలగించడానికి ప్రముఖ హెయిర్ ఆయిల్ కంపెనీ నీహార్ నేచురల్ శాంతి ఆమ్లా సంస్థ యాజమాన్యం నడుం బిగించింది. "ఫోన్ ఉఠావో, ఇండియా పఢావో" క్యాంపెయిన్ ను చేపట్టింది. గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యాన్ని కల్పించడమే ఈ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశం. ఫోన్ ఉఠావో ఇండియా పడావో అనే ఈ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న చదువుకున్న యువతను గ్రామీణ ప్రాంతాల్లో నివాసముంటున్న వెనకబడిన వర్గాలకు చెందిన చిన్నారులతో అనుసంధానం చేయడం జరుగుతుంది. ఇంగ్లీషు నేర్చుకోవాలనుకునే చిన్నారులు ఈ పట్టణ ప్రాంతపు యువతతో కనెక్ట్ అవుతారు. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 55 వేల నిమిషాల పాటు నాణ్యతతో కూడిన విద్యను బోధిస్తారు. మీకు వచ్చే ఫోన్‌కాల్‌ను తీసుకుని ఇందులో భాగస్వాములు కావాలని ఈ హెయిర్ ఆయిల్ సంస్థ కోరుతోంది.తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే చిన్నారుల స్థితిగతులను విద్య ద్వారా మార్చాలని కోరుతోంది. ఇందుకు వారంలో ఒక్కసారి వారికోసం 10 నిమిషాల సమయం కేటాయించాల్సిందిగా హెయిర్ ఆయిల్ సంస్థ కోరుతోంది. "ఫోన్ ఉఠావో, ఇండియా పడాఓ" కార్యక్రమం ద్వారా తమ పేర్లను రిజిస్టర్ చేసుకునే పట్టణప్రాంత యువత చిన్నారుల విద్యకోసం 10 నిమిషాలు కేటాయిస్తామని కమిట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పదినిమిషాల్లో ఫోన్ ద్వారా వారికి స్పోకెన్ ఇంగ్లీష్‌ను నేర్పించాల్సి ఉంటుంది. ఈ చిన్నారులు ఓ టోల్ ఫ్రీ ఐవీఆర్ నెంబరు నుంచి ఫోన్ చేసి ఆ సమయంలో అందుబాటులో ఉన్న వాలంటీర్లతో కనెక్ట్ అవుతారు.
ఈ ఫోన్‌కాల్ సమయంలో విద్యార్థులు తాము ఇంగ్లీషులో నేర్చుకున్నది చెప్పడమో లేక వారి స్కూల్లో ఇంగ్లీషు క్లాసులో నేర్చుకున్న అంశాలు చెప్పడమో చేస్తారు. లేదా ఏదైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇలా 10 నిమిషాలు మాట్లాడటం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే ఇంగ్లీషును చాలా సింపుల్‌గా సరదా పద్ధతిలో నేర్పించాలన్నదే తమ ఐడియాగా కంపెనీ పేర్కొంది. అది కూడా ఉచితంగా నేర్పించడం ముఖ్యమైనది. అయితే చాలామందికి ఇంగ్లీషు మాత్రమే ఎందుకనే సందేహం కలగొచ్చు. అయితే ఇంగ్లీషును యూనివర్శల్ లాంగ్వేజ్‌గా పరిగణిస్తున్నాము.అంతేకాదు జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఇంగ్లీషు మాట్లాడటం తెలిస్తే చాలు అనేది కంపెనీ అభిప్రాయం. అంతేకాదు చాలా చోట్ల ఇంగ్లీషు మాట్లాడటం వచ్చిన వారికి ఉద్యోగవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. నీహార్ శాంతి పాఠశాల ఫన్వాలా అనే కార్యక్రమం కింద ఓ సంస్థ ద్వారా నాణ్యమైన విద్యను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అసలు నీహార్ శాంతి పాఠశాల ఫన్‌వాలా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమే పిల్లలకు ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీషు నేర్పించడమని కంపెనీ వెల్లడించింది.గత కొన్నేళ్లుగా నీహార్ శాంతి పాఠశాల ఫన్‌వాలా కింద దాదాపు 7500 గ్రామాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమం నిర్వహించామని ఇందుకోసం 3 లక్షలకు పైగా విద్యార్థుల నుంచి 8.5 లక్షలకు పైగా ఫోన్ కాల్స్ చేసినట్లు కంపెనీ వివరించింది. అమ్మాయిలను చదివించండి అనే ఎన్జీఓ సంస్థతో కూడా నీహార్ నేచురల్ శాంతి ఆమ్లా సంస్థ జతకట్టింది. ఈ కార్యక్రమం కింద పబ్లిక్ ప్రైవేట్ వనరుల ద్వారా అట్టడుగున ఉన్న బాలికలకు నాణ్యమైన విద్యను అందిస్తుంది.తద్వారా విద్య మరియు పాఠశాల నాణ్యతను మెరుగుపరుస్తుంది. బాలికలందరికీ ప్రవర్తనా, సామాజిక మరియు ఆర్ధిక పరివర్తనను సాధిస్తుంది. ఇక ఇప్పటికీ కొన్ని లింగ విబేధాలు కనిపిస్తున్నాయి. అట్టి వాటిని రూపుమాపి నాణ్యమైన విద్యను అదించడంలో సమాన అవకాశాలు కల్పించి దేశంలోని బాలబాలికలను తీర్చిదిద్దుతుందని సంస్థ తెలిపింది. గతేడాది ధార్, మధ్యప్రదేశ్, ఉదయ్‌పూర్, రాజస్థాన్‌లలో ఈ కార్యక్రమం ద్వారా 2లక్షల మంది విద్యార్థులు లబ్ధిపొందారని నీహార్ నేచురల్ శాంతి ఆమ్లా సంస్థ తెలిపింది. చిన్నారుల జీవితాలను మార్చేందుకు చిన్న మంత్రం పాటిద్దాం. ఫోన్ ఉఠావో ఇండియా కో పడావో కార్యక్రమం ఇంగ్లీషు మాట్లాడగలిగే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఒక చిన్నారి సొంతంగా నైపుణ్యంను పెంపొదించేందుకు ఈ కార్యక్రమం సహాయపడుతుంది ఈ ఏడాది అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మీకు మా నుంచి వచ్చే ఫోన్ కాల్ తీసుకుని ఒక చిన్నారి జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చేందుకు సహకరించండి. కేవలం 10 నిమిషాలు కేటాయించి మంచి మనస్సుతో పేద పిల్లల జీవితాలను మార్చడంలో మీరు భాగస్వాములు అవ్వండి. ఈ కింది లింకును క్లిక్ చేసి వాలంటీర్‌గా నమోదు చేసుకోండి.
Wednesday, September 18, 2019
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని బుధవారం నాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటి వరకూ పాలకమండలిలో 16 మంది సభ్యులు ఉండగా.. ఈ సంఖ్యను ప్రభుత్వం ఇటీవల 25మందికి పెంచింది.
వీరితో పాటు దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ ఈవో, దేవదాయ శాఖ కమిషనర్, తుడా చైర్మన్.. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు.
గ్రీన్ భద్రాద్రి ఆహ్వానం
భద్రాచల పురప్రముఖులు ప్రజలకు స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులకు అందరికీ విజ్ఞప్తి 2012 నుండి మొదలైన గ్రీన్ భద్రాద్రి ఉద్యమం రోజురోజుకీ అందరి సహకారంతో అభివృద్ధి చెందుతూ ఇప్పటివరకు సుమారు 8 వేల మొక్కలు నాటాము గత సంవత్సరం మొక్కలు నాటి ఇప్పుడు రెండో విడత ప్రోగ్రాం గా మన భద్రాచలం టూరిజం హోటల్ మొదలు పెట్టుకుని గుడి వరకు సుమారు 70 మొక్కలు నాటుతున్న స్పాన్సర్ అయినటువంటి దుర్గా ప్రసాద్ గారికి అభినందలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మన ఐటీడీఏ పీవో గారు ప్రారంభిస్తున్నారు 18-09-2019 బుధవారము ఉదయం ఎనిమిది గంటలకి కావున అందరు కూడా దయచేసి ఇందులో ప్రోత్సాహం కోసం అందరూ హాజరు అవుతారని కోరుకుంటున్నా ఈ కార్యక్రమం ఎంత విలువైందో ఎంతో అవసరమైన మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం కూడా చాలా బాగా మొక్కలు నాటడం జరిగింది అందరి సహకారంతో దయచేసి అందరూ హాజరు కావాలని కోరుకుంటున్నాము ఇట్లు భూపతి రావు ప్రెసిడెంట్
-
'జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బిహారీ వలసదారులు, కాశ్మీరీ పండిట్లు, సిక్కులను లక్ష్యంగా చేసుకుంటున్నారు 'అని రౌత్ ...
-
పేదోళ్ల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మంజూరులో లంచం డిమాండ్ చేసే అధికారుల దవడ పగలకొట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. అలా చేస్తేనే కొంతమంది...
-
ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో తెలంగాణ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్ని...