Monday, December 23, 2019

పురపాలక ఎన్నికల ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల


పురపాలక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. వార్డుల వారీ ఓటర్ల జాబితా షెడ్యూల్ ప్రకటించింది. 120 మున్సిపాల్టీలు, పది కార్పోరేషన్లలో ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 30న వార్డుల వారీ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేయనుంది. ముసాయిదాపై వచ్చేనెల రెండో తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ఈనెల 31న జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. మున్సిపాల్టీలు, కార్పోరేషన్ల స్థాయిలో వచ్చేనెల 1న పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. వచ్చే నెల నాలుగో తేదీన వార్డుల వారీ తుది జాబితా ప్రకటిస్తారు.


Monday, December 9, 2019

మోడీ ప్రభుత్వం PF కొత్త ప్లాన్


ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వినియోగం తగ్గి, ఉత్పత్తులు పడిపోయి, వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల వినిమయ శక్తిని పెంచేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. వివిధ రంగాలకు ఉద్దీపనలు ప్రకటించింది. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. వినిమయ శక్తిని పెంచేందుకు, ఆర్థిక మందగమనం లేకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వివిధ అంశాలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితం చెప్పారు. అయితే ఇప్పుడు వినియోగాన్ని పెంచేందుకు తక్కువ ఆదా, మరింత ఖర్చు మంత్రాన్ని తెచ్చేలా కనిపిస్తోంది.
ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. సంఘటిత రంగంలోని లక్షలాదిమంది ఉద్యోగుల శాలరీ-పీఎఫ్‌లో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ తగ్గించుకొని, టేక్ హోమ్ శాలరీ ఎక్కువగా ఉండేలా ఆప్షన్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఇది బేసిక్ శాలరీలో 12 శాతంగా ఉంది. దీనిని ఇప్పుడు తగ్గించుకొని, టేక్ హోమ్ శాలరీ ఎక్కువగా తీసుకునే వెసులుబాటు ఉద్యోగులకు కల్పించనుంది.
ఈ మేరకు సోషల్ సెక్యూరిటీ కోడ్ బిల్ 2019లో ఒక ప్రొవిజన్‌గా ఉది ఉంటుందని కేంద్ర కార్మిక సాఖ తెలిపింది. దీనికి కేబినెట్ ఆమోదం లభించింది. ఈ వారంలో దీనిని పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నట్లు లేబర్ మినిస్ట్రీ అధికారులు చెబుతున్నారు. ఉద్యోగులకు తక్కువ పీఎఫ్, ఎక్కువ టేక్ హోమ్ శాలరీ ఆప్షన్ ఉంటే వ్యవస్థలో వినిమయ శక్తి పెరుగుతుందని కేంద్రం భావిస్తోందట. ఇటీవలి కాలంలో వినియోగం తగ్గి, డిమాండ్ లేక, వృద్ధి రేటు ఏడెనిమిదేళ్ల కనిష్టానికి చేరుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం పీఎఫ్ అంశంలో కొత్త ఆలోచన చేస్తోందని తెలుస్తోంది.
కేంద్రం పీఎఫ్‌ను 12 శాతంగానే ఉంచిందని, పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌పై బిల్లును పార్లమెంటులో చర్చించి, పాస్ అయ్యాక నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. పీఎఫ్ 12 శాతంగానే ఉన్నప్పటికీ, ఉద్యోగులకు ఆప్షన్ మాత్రమే ఉంటుంది. అంటే అది వారి ఇష్టం.


ఆ ఎస్‌బీఐ డెబిట్‌ కార్డ్‌లు ఇక పనిచేయవు!


దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు మాగ్నటిక్ స్టిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ కార్డులతో మార్చుకోవాలని సూచిస్తోంది. కస్టమర్ల వద్ద ఉన్న పాత కార్డులు డిసెంబర్ 31 తరువాత పనిచేయవని తెలిపింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం కార్డులను రీప్లేస్ చేసినట్టు వివరించింది. మాగ్నటిక్ స్టిప్ కార్డులతో మోసాలు జరుగుతుండడంతో వాటిని అరికట్టే ప్రయత్నంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2016లో అప్పటికి వినియోగంలో ఉన్న మాగ్నటిక్ స్టిప్ డెబిట్ కార్డుల స్థానంలో ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులను ఆర్బీఐ ప్రవేశ పెట్టింది . ఇప్పటికీ కూడా కొత్త ఈఎంవీ చిప్ కార్డు పొందని కస్టమర్లకు వెంటనే బ్యాంక్‌కు వెళ్లి కార్డును మార్చుకోవాలని కస్టమర్లకు సూచించింది.

మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డును మార్చుకోవడానికి

కస్టమర్లు ఆయా బ్రాంచ్‌లకు వెళ్లి దరఖాస్తు

చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఎస్‌బీఐ

తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ట్వీట్ కూడా

చేసింది. కొత్త ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత ఎస్‌బీఐ

డెబిట్ కార్డు తీసుకోవాలని తెలిపింది. ఈ కార్డుల

వల్ల ఎన్నో మోసాలు జరుగుతున్నాయని, వాటిని

దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు

తెలిపింది. మాగ్నటిక్ స్టిప్ కార్డులు

మార్చుకోవాలని ఇప్పటికే ఎన్నో సార్లు

సూచించడం జరిగిందని, కార్డులను మార్చుకోని

వారికి ఇక ఈనెల 31 వరకు మాత్రమేనని పేర్కొంది.

సూచించింది.