- నెదర్లాండ్‌లోని నిజ్మాజెన్ నగరంలో గల రాడ్‌బౌడ్ యూనివర్శిటీకి ఈ వింతైన ఆలోచన వచ్చింది.
- విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి దూరం చేసి.. ఉత్సాహం నింపేందుకు ఇదో చక్కని మార్గం అని, దీన్నే ధ్యాన సమాధి (మెడిటేషన్ గ్రేవ్) అంటారని యూనివర్శిటీ అధికారులు తెలుపుతున్నారు.
- 30 నిమిషాల నుంచి 3 గంటల సేపు ఈ సమాధిలో ధ్యానం చేసుకోడానికి విద్యార్థులకు అవకాశం ఇస్తామని పేర్కొంది.
Monday, November 25, 2019
విద్యార్థులను సమాధిలో పడుకోబెడుతున్న యూనివర్శిటీ..
Friday, November 22, 2019
కిరోసిన్ పోసుకొని నిప్పు పెట్టుకున్న ఏఎస్‌ఐ
కిరోసిన్ పోసుకొని నిప్పు పెట్టుకున్న ఏఎస్‌ఐ
ఇలియానా ఆత్మహత్యాయత్నం...!
ప్రతీ వ్యక్తి జీవితంలో కష్ట సుఖాలు అనేవి ఏదో సమయంలో పలకరిస్తూనే ఉంటాయి. కాకపోతే కొందరికి ఎక్కువ మరికొందరికి తక్కువ అంతే తేడా. ఇక ఈ కష్టసుఖాలను సెలెబ్రిటీలు కూడా ఏ మాత్రం అతీతులు కాదు. బయటకు అలా కనిపించినా వారి వారి వ్యక్తిగత జీవితాల్లోనూ ఎన్నో కష్టసుఖాలు నిండి ఉంటాయి. ఈ కోవలోనే గోవా బ్యూటీ ఇలియానా జీవితంలో కష్టాలు పడిందట. అవి తట్టుకోలేక చివరకు ఆత్మహత్యాయత్నం కూడా చేసిందట. తాజాగా ఆ విషయాలు బయటపెట్టింది ఇలియానా. వివరాల్లోకి పోతే.. దేవదాస్ సినిమాతో టాలీవుడ్ తెరకు కొత్త అందాల రుచి చూపించి వావ్! అనిపించింది గోవా బ్యూటీ ఇలియానా. ఆ తర్వాత వరుస ఆఫర్స్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈమె.. వెంటనే రూటు మార్చేసి బాలీవుడ్ వైపు మొగ్గుచూపింది. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించే అవకాశం రావడంతో అక్కడే సెటిలై తెలుగు సినిమాలకు కొంతకాలం దూరంగా ఉంది. నాజూకు నడుముతో ఇలియానా చేసిన డాన్సులు, అందాల ప్రదర్శనకు ఫిదా అయింది టాలీవుడ్ లోకం. అయితే కొన్నేళ్ల పాటు తెలుగు తెరకు దూరమైన ఈమె తిరిగి 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో దర్శనమిచ్చింది. కాకపోతే మునుపటిలా కాకుండా బొద్దుగా తయారై టాలీవుడ్ ప్రేక్షకులకు షాకిచ్చింది. కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్‌గా రికార్డు నెలకొల్పిన ఈ అమ్మడు తన జీవితంలో చాలా కష్టాలున్నాయని, ఒకానొక దశలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆత్మహత్యకు కూడా యత్నించానని చెప్పి ఆశ్చర్యపరిచింది ఇలియానా. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు స్వయంగా చెప్పింది ఇల్లీ బేబీ. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రఫర్ ఆండ్య్రూతో పీకల్లోతు ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న ఇలియానా.. ఆ తర్వాత ఊహించని రీతిలో అతనితో బ్రేకప్ చేసుకుంది. ఈ విషయాన్ని ఇలియానా తట్టుకోలేక పోయిందట. తనకు ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చేవని కూడా ఇలియానా చెప్పుకొచ్చింది. ఓ వైపు సినిమాలు లేక, మరోవైపు వ్యక్తిగత జీవితం గాడి తప్పడంతో చచ్చిపోవడమే మేలని ఆమె భావించిందట. జీవితంలో ఎదురైన కొన్ని పరిస్థితులు తట్టుకోలేక ఓ రోజు ఏకంగా 12 పవర్ ఫుల్ నిద్రమాత్రలు కూడా మింగానని చెబుతోంది ఇలియానా. ఆ పరిస్థితుల్లో నిద్ర కూడా పట్టేది కాదని, నిద్రలేమి వల్లే తాను చాలా బరువు పెరిగిపోయానని ఇలియానా తెలిపింది. ఆ తర్వాత ఆ బరువు తగ్గించుకోవడానికి జిమ్‌కు వెళ్లేదాన్నని, ఆ సమయంలో మీడియా చాలా ఫొటోలు తీసిందని, ఆ ఫొటోలు బయటికి రావడంతో తనను సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేయడం కూడా బాధ పెట్టిందని తెలిపింది ఇలియానా.
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆర్టీసీ రూట్ల ప్రైవైటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూట్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇది ఓ రకంగా ఆర్టీసీ జేఏసీకి షాకేనని చెప్పవచ్చు. 5100 రూట్లను ప్రైవేటుకు అప్పగిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో రూట్ల ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున వాదనలు గట్టిగా వినిపించారు. ప్రభుత్వానికి సానుకూలంగా హైకోర్టు తీర్పు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రూట్ల ప్రైవేటీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారానేది ఉత్కంఠగా మారేది. దాదాపు గత 50 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత గురువారం సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పారు. అయితే, మళ్లీ శుక్రవారం సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని చెప్పడం గమానర్హం. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.ఆర్టీసీ ప్రైవేటీకరణపై సుదీర్ఘ వాదోపవాదలు జరిగాయని న్యాయవాది ఒకరు తెలిపారు. మోటార్ వెహికిల్ యాక్ట్ 1988 సెక్షన్ 102 ప్రకారం ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉందని.. మంత్రివర్గానికి విస్తృత అవకాశాలున్నాయి.. కోర్టులు జోక్యం చేసుకోజాలవని పేర్కొంది. ఈ మేరకు అడ్వోకేట్ జనరల్ చేసిన వాదనలతో హైకోర్టు ఏకీభవించిందన్నారు. పబ్లిక్ లిటిగేషన్స్ కొట్టివేయడం జరిగిందన్నారు. ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా జోక్యం చేసుకోలేమని చెప్పిందని తెలిపారు.
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ అంటే ఏంటి? ప్రయాణికులకు లాభమా? నష్టమా?
అసలు రూట్ల ప్రైవేటీకరణ అంటే ఏంటి? దీని వల్ల సాధారణ ప్రయాణికులకు లాభమా? నష్టమా? ఆర్టీసీ కార్మికులకు లబ్ది జరుగుతుందా? నష్టం జరుగుతుందా?
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ఆర్టీసీలో రూట్ల ప్రైవేటీకరణను సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టలేమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అసలు రూట్ల ప్రైవేటీకరణ అంటే ఏంటి? దీని వల్ల సాధారణ ప్రయాణికులకు లాభమా? నష్టమా? ఆర్టీసీ కార్మికులకు లబ్ది జరుగుతుందా? నష్టం జరుగుతుందా? ఇలాంటి ఎన్నో సందేహాలు ఉన్నాయి. తెలంగాణ ఆర్టీసీలో 10వేలకు పైగా రూట్లు ఉన్నాయి. అందులో కొన్ని లాభాలు వచ్చే రూట్లు ఉన్నాయి. కొన్ని నష్టాలు వచ్చే రూట్లు కూడా ఉన్నాయి. అయితే మొత్తం రూట్లలో సుమారు 50 శాతం ( 5100 రూట్లు) ప్రైవేటీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన 50 శాతంలో 30 శాతం రూట్లను ఆర్టీసీ కార్పొరేషన్ బస్సులు నడుస్తాయి. మరో 20 శాతం ఆర్టీసీ కార్పొరేషన్ కింద అద్దె బస్సులు నడుపుతారు. ఈ క్రమంలో అసలు రూట్ల ప్రైవేటీకరణ అంటే ఏంటి? దీని వల్ల సాధారణ ప్రయాణికులకు లాభమా? నష్టమా? ఆర్టీసీ కార్మికులకు లబ్ది జరుగుతుందా? నష్టం జరుగుతుందా? ఇలాంటి ఎన్నో సందేహాలు ఉన్నాయి. తెలంగాణ ఆర్టీసీలో 10వేలకు పైగా రూట్లు ఉన్నాయి. అందులో కొన్ని లాభాలు వచ్చే రూట్లు ఉన్నాయి. కొన్ని నష్టాలు వచ్చే రూట్లు కూడా ఉన్నాయి. అయితే మొత్తం రూట్లలో సుమారు 50 శాతం ( 5100 రూట్లు) ప్రైవేటీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన 50 శాతంలో 30 శాతం రూట్లను ఆర్టీసీ కార్పొరేషన్ బస్సులు నడుస్తాయి. మరో 20 శాతం ఆర్టీసీ కార్పొరేషన్ కింద అద్దె బస్సులు నడుపుతారు. రూట్లను ప్రైవేటీకరించడం అంటే ఆయా మార్గాల్లో ప్రైవేట్ ఆపరేటర్లు తమ బస్సులను నడుపుతారు. ఆ బస్సుల్లో డ్రైవర్, కండెక్టర్ కూడా ప్రైవేట్ వాళ్లే ఉంటారు. అలా నడుపుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు సంవత్సరానికి కొంత మొత్తం ఆర్టీసీ కార్పొరేషన్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఆ బస్సుల్లో టికెట్ ధరలను ప్రభుత్వం నియంత్రిస్తుంది. ప్రభుత్వం చెప్పినదాని కంటే ఎక్కువ ధరలు వసూలు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వం జారీ చేసే అన్ని రకాల పాస్‌లు (విద్యార్థులు, జర్నలిస్ట్ పాస్)లు కూడా ప్రైవేట్ రూట్లలో చెల్లుబాటు అవుతాయని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. లాభాలు, నష్టాలు వచ్చే అన్ని మార్గాల్లోనూ ప్రైవేట్ ఆపరేటర్లు బస్సులు నడుపుతారని కూడా చెప్పారు. ప్రస్తుతం ఉన్న విధానంలో ఆర్టీసీని నడపడం అసాధ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు వ్యాఖ్యానించారు. అంటే దాంట్లో కొంత మార్పులు చేసి నడపాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటార్ వెహికల్ చట్టం ఆయనకు ఆయుధంగా మారింది ప్రభుత్వం తీసుకొచ్చిన రూట్ల ప్రైవేటీకరణ వల్ల ప్రయాణికులకు ఎలాంటి లాభం జరుగుతుందనేది పరిశీలిస్తే... వారికి కొత్త కొత్త బస్సులు, అందులో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. అయితే, రేట్ల విషయంలోనే కొంత అనుమానం. ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్‌ను పరిశీలిస్తే.. వాటికి కూడా ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. కానీ, పండుగల సమయాల్లో ఎలా వసూలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇలాంటివి ప్రైవేట్ ఆపరేటర్లు కూడా అమలు చేస్తే ప్రయాణికుల జేబులకు కొంత చిల్లు తప్పదు. దీంతోపాటు ధరల నియంత్రణకు ప్రభుత్వం ఓ రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆకమిటీ ఎప్పటికప్పుడు ధరలను సవరించడానికి చాన్స్ ఉంది. టికెట్ రేట్లు పెంచితే ప్రజలు ఓట్లు వేయరేమోననే భయంతో ప్రభుత్వాలు బస్సుల టికెట్ ఛార్జీలు పెంచకుండానే నెట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేస్తే.. ప్రభుత్వంతో పనిలేకుండా ఎప్పటికప్పుడు ధరల సవరణ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో సుమారు 50వేల మంది ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు. వారంతా కలసి 10వేల రూట్లలో బస్సులు నడుపుతున్నారు. అందులో 50 శాతం ప్రైవేటీకరిస్తే.. సగం మంది ఉద్యోగుల పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతుంది. వారిని ఏం చేస్తారు? ఎలా వినియోగించుకుంటారని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం (సీఎం కేసీఆర్) మనసులో ఏముందో తెలియాల్సి ఉంది. అయితే, అధికారవర్గాల సమాచారం ప్రకారం.. దీనిపై తొలుత ఓ కమిటీ ఏర్పడుతుందని, రూట్ల ప్రైవేటీకరణ, కార్పొరేషన్ ఆస్తులు, కార్మికుల భవిష్యత్తు ఇతర అంశాలపై ఆ కమిటీ పరిశీలించి నివేదిక ఇస్తుందని చెబుతున్నారు. ఆ కమిటీ రిపోర్టును బట్టి ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ఆధారపడి ఉంది
Tuesday, November 19, 2019
తెలంగాణ పాఠశాలల్లో త్వరలోనే ‘నీటి గంటలు’
తెలంగాణ పాఠశాలల్లో త్వరలోనే 'నీటి గంటలు' మ్రోగనున్నాయి. విద్యార్ధులు నీళ్ళు త్రాగకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించిన కేరళ ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రతీ పాఠశాలలో నిర్ధిష్ట సమయంలో రోజుకు మూడుసార్లు గంట మ్రోగించి విద్యార్దులందరూ తప్పనిసరిగా నీళ్ళు త్రాగేలా చేస్తోంది. అది చూసి కర్ణాటక ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అమలుచేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలో 'నీటి గంటలు' మ్రోగించాలని నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డీఈఓలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ కంటే ముందుగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిమ్మంపేట, నారాయణపేటలోని ఎడవల్లి ప్రభుత్వ పాఠశాలలో 'నీటి గంటలు' పద్దతి అమలుచేయడం ప్రారంభించి యావత్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచాయి. పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో సరైన టాయిలెట్లు లేకపోవడం వలన నీళ్ళు త్రాగితే మూత్రవిసర్జనకు వెళ్ళవలసి వస్తుందనే భయంతో చాలా మంది విద్యార్దులు ముఖ్యంగా బాలికలు దాహం వేస్తున్నా నీళ్ళు త్రాగడం మానుకొంటున్నారు. దాని వలన వారు తీవ్ర డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. ఆ కారణంగా చిన్నప్పటి నుంచే విద్యార్దులలో కిడ్నీ, లివర్, చర్మ సంబందిత ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విద్యాలయాలలో టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టి, త్రాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. కానీ నేటికీ రాష్ట్రంలో అనేక పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో సరైన టాయిలెట్లు, త్రాగునీటి సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్దులు నీళ్ళు త్రాగకుండా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం నీటి గంటల పద్దతి అమలుచేయడంతోపాటు రాష్ట్రంలో విద్యాలయాలలో టాయిలెట్లు, త్రాగునీరు సౌకర్యాలు కూడా కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
Friday, November 8, 2019
*అనిశా వలలో గూడూరు తహశీల్దార్*
*అనిశా వలలో గూడూరు తహశీల్దార్*
*కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనాబీ అనిశా వలకు చిక్కుకున్నారు. రైతు నుంచి రూ.4 లక్షలు లంచం తీసుకునేందుకుప తన తరఫున మహబూబ్ బాషా అనే వ్యక్తిని తహసీల్దార్ పంపించారు*
రైతు నుంచి లంచం తీసుకుంటూ ఉండగా.. హసీనాబీ పంపిన వ్యక్తిని అనిశా అధికారులు పట్టుకున్నారు. అతడిని విచారించగా తహసీల్దార్ తనని పంపించినట్లు అనిశా అధికారులకు మహబూబ్ బాషా చెప్పాడు. అతడి నుంచి రూ.4 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మహబూబా బాషాను అరెస్టు చేసిన సమాచారాన్ని తెలుసుకున్న హసీనాబీ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
Thursday, November 7, 2019
♨ *రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తాసిల్దార్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ మృతి..*♨
ఎమ్మార్వో విజయ రెడ్డి హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడు సురేష్ మృతి
సురేష్ ఒంటిపై 65 శాతం కాలిన గాయాలు...
సురేష్ కు వైద్య పరీక్షలు నిమిత్తం ఈ నెల 4న ఉస్మానియా ఆస్పత్రి లో చేరిన సురేష్....
ప్రస్తుతం న్యూరో బర్న్ షాక్ లో వుండి మృతి చెందిన ప్రధాన ముద్దాయి సురేష్..
మరికొద్ది సేపట్లో ఉస్మానియా మార్చురీకి సురేష్ మృతదేహం..
ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించనున్న వైద్యులు..
సురేష్ భార్య లత తల్లిదండ్రులతో పాటు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు..
♨ *రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తాసిల్దార్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ మృతి..*♨
ఎమ్మార్వో విజయ రెడ్డి హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడు సురేష్ మృతి
సురేష్ ఒంటిపై 65 శాతం కాలిన గాయాలు...
సురేష్ కు వైద్య పరీక్షలు నిమిత్తం ఈ నెల 4న ఉస్మానియా ఆస్పత్రి లో చేరిన సురేష్....
ప్రస్తుతం న్యూరో బర్న్ షాక్ లో వుండి మృతి చెందిన ప్రధాన ముద్దాయి సురేష్..
మరికొద్ది సేపట్లో ఉస్మానియా మార్చురీకి సురేష్ మృతదేహం..
ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించనున్న వైద్యులు..
సురేష్ భార్య లత తల్లిదండ్రులతో పాటు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు..
Monday, November 4, 2019
*తహశీల్దార్ సజీవ దహనం; అసలేం జరిగింది...?
హయత్‌నగర్:- తెలంగాణలో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ హత్య కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తహశీల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేసిన వ్యక్తిని కూర సురేశ్ ముదిరాజ్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే దానిపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తహశీల్దార్ కార్యాలయానికి సురేశ్ వచ్చాడు. తహశీల్దార్‌తో మాట్లాడాలంటూ పర్మిషన్ తీసుకుని విజయారెడ్డి గదిలోకి వెళ్లాడు. లంచ్‌కు వెళ్లాల్సిన ఆమె ఆగిపోయి అతడితో మాట్లాడారు. దాదాపు అరగంట పాటు అక్కడ ఉన్నాడు. తర్వాత ఆమెతో వాగ్విదానికి దిగినట్టు తెలిసింది. తర్వాత తలుపులు మూసేసి విజయారెడ్డిపై దాడిచేశాడు. అరుపులు విన్న విజయారెడ్డి డ్రైవర్ తలుపులు పగులగొట్టేందుకు ప్రయత్నించగా కాలిన గాయాలతో సురేశ్ బయటకు వచ్చాడు. విద్యుత్ షాట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నాయని చెబుతూ చొక్కా విప్పేసి అక్కడి నుంచి బయటకు పరుగులు పెట్టాడు. కాలిన గాయాలతో పోలీస్ స్టేషన్ ముందు పడిపోయాడు. అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. సురేశ్‌కు 60 శాతం గాయాలయ్యాయి. హయత్‌నగర్ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేశ్ భూవివాదం కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. తన భూమి సమస్యలు పరిష్కారించాలని కొంతకాలంగా సురేశ్ తహశీల్దార్‌కి లంచం ఇచ్చి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే విజయారెడ్డిని హత్య చేసినట్టు తెలుస్తోంది. విజయారెడ్డి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
, *ఎవరీ విజయారెడ్డి...?*🔥
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం తోటపల్లి విజయారెడ్డి సొంతూరు. ఆమె తండ్రి సి.లింగారెడ్డి కొండారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి గ్రామం ఆమె అత్తగారి ఊరు. విజయారెడ్డి భర్త సుభాష్ రెడ్డి హయత్‌నగర్ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయారెడ్డి కుటుంబం కొత్తపేటలోని గ్రీన్‌హిల్స్ కాలనీలో ఉంటోంది. రంగారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో గతంలో ఎమ్మారోగా పనిచేసిన విజయారెడ్డి కొద్దినెలల క్రితమే అబ్దుల్లాపూర్‌మెట్‌కు వచ్చారు. భూములకు సంబంధించిన పాస్‌బుక్కుల వ్యవహారంలో గతంలో పలువురితో ఆమె వాగ్వివాదానికి దిగినట్టు తెలుస్తోంది.
, _*రెవెన్యూ ఉద్యోగుల ధర్నా.....*✊
విజయారెడ్డి మృతితో దిగ్భ్రాంతికి గురైన రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దాడులకు తమకు రక్షణ కల్పించాలంటూ రహదారిపై ధర్నా చేపట్టారు. విజయారెడ్డిని హత్య చేసిన సురేశ్‌ను చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వికారాబాద్ జిల్లాలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో రెవెన్యూ సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.
-
'జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బిహారీ వలసదారులు, కాశ్మీరీ పండిట్లు, సిక్కులను లక్ష్యంగా చేసుకుంటున్నారు 'అని రౌత్ ...
-
పేదోళ్ల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మంజూరులో లంచం డిమాండ్ చేసే అధికారుల దవడ పగలకొట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. అలా చేస్తేనే కొంతమంది...
-
ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో తెలంగాణ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్ని...